AP: దివ్యాంగ శక్తి అమలుకు సర్వం సిద్ధం

ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. బుధవారం నుంచి దివ్యాంగ శక్తి పేరుతో పథకాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని గుంటూరు బస్టాండ్‌లో ప్రారంభించనున్నారు. దివ్యాంగ శక్తి పథకానికి సంబందించి పాస్‌లు కూడా జారీ చేస్తున్న ఆర్టీసీ. పథకం ప్రారంభానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది. దివ్యాంగుల్ని ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఇప్పటి వరకు దివ్యాంగులకు 50 శాతం ఛార్జీతో ఈ ఐదు రకాల బస్సుల్లో ప్రయాణానికి అనుమతించార. కానీ ఇకపై దివ్యాంగులకు జీరో ఫేర్ టికెట్ జారీచేస్తారు. దివ్యాంగులకు ఇప్పుడున్నట్లుగానే 50 శాతం రాయితీతో నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కొనసాగుతుంది. . ఇప్పటివరకు వీటిలో 50 శాతం ఛార్జీతో దివ్యాంగులు ప్రయాణిస్తున్నారు. ఇకపై జీరో ఫేర్ టికెట్ జారీచేస్తారు. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, అల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఇప్పుడున్నట్లుగానే 50 శాతం రాయితీతో ప్రయాణించే సదుపాయం కొనసాగుతుంది. దీనిపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బస్‌పాస్‌ల జారీ షురూ...
దివ్యాంగ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించి.. దివ్యాంగులకు ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లలో పాస్‌లు జారీ చేస్తున్నారు. కొత్తగా పాస్ తీసుకోవాలంటే.. సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డ్‌లతో బస్‌పాస్ కౌంటర్‌కు వెళితే బస్ పాస్ ఇస్తారు. ఒకవేళ గతంలో 50 శాతం రాయితీ వర్తించే పాస్ ఉన్నవాళ్లు ఆ పాస్‌తోనే ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. ఆ పాస్ గడువు ఉన్నంత వరకు కొనసాగుతుంది. ఆర్టీసీ డిజిటల్ పాస్ పొందే సౌకర్యం కూడా కల్పించింది. దీని కోసం మొబైల్ యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ తీసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా సదరం ఐడీ నంబరును నమోదు చేస్తారు. అయితే పాస్ కోసం నామమాత్రపు ఫీజును ఆన్లైన్లో చెల్లిస్తే చాలు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ పాస్ జారీ చేస్తారు. ఆర్టీసీ కౌంటర్, యాప్ మాత్రమే కాదు ప్రభుత్వ వాట్సప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా కూడా డిజిటల్ బస్‌పాస్ తీసుకోవచ్చు. కాకపోతే డిజిటల్ పాసు తీసుకున్నవారు మొబైల్లో డిజిటల్ పాస్‌తో పాటుగా సదరం ఒరిజనల్ సర్టిఫికెట్ కండక్టర్‌కు చూపించాలి. ఇలా దివ్యాంగులు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
