AP: యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలు అయ్యేలా నిర్ణయించింది. ఈ విధానం ద్వారా 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందేలా కార్యాచరణ రూపొందించింది.
ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రీడ్ పాలసీ
493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రీడ్ విధానం అమలు చేయనున్నారు.. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రీడ్ విధానంలో ఉచితంగా అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం.. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయనుంది.. రూ.2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్ ఇన్సూరెన్సు కంపెనీ పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం ఉంటుంది.
10 వైద్య కళాశాలలకు ఆమోదం
కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఎఫ్‌పీ జారీకి కేబినెట్ అనుమతి ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com