AP: గూగుల్‌తో ఏపీ చరిత్రాత్మక ఒప్పందం

AP: గూగుల్‌తో ఏపీ చరిత్రాత్మక ఒప్పందం
X
ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. పదేళ్లలో రూ. 80 వేల కోట్లకుపైగా పెట్టుబడులు.. హాజరైన కేంద్రమంత్రులు నిర్మల, అశ్వినీ వైష్ణవ్

కూ­ట­మి ప్ర­భు­త్వ ఆధ్వ­ర్యం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రూ­పు­రే­ఖ­లు మా­ర­బో­తు­న్నా­యి. ఏపీ భవి­ష్య­త్తు­ను మలు­పు­తి­ప్పే అతి­పె­ద్ద ప్రా­జె­క్టు­కు ఏపీ ప్ర­భు­త్వం ఒప్పం­దం కు­ద­ర్చు­కుం­ది. వి­శా­ఖ­ప­ట్నం­లో దే­శం­లో­నే తొలి కృ­త్రిమ మే­ధ­స్సు (AI) కేం­ద్రా­న్ని “గూ­గు­ల్ ఏఐ హబ్” పే­రు­తో ఏపీ ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­య­నుం­ది.. ‘భా­ర­త్‌ ఏఐ శక్తి’ పే­రిట ని­ర్వ­హిం­చిన ఈ కా­ర్య­క్ర­మం­లో ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు, మం­త్రి లో­కే­ష్, కేం­ద్ర ఆర్థిక మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, కేం­ద్ర సమా­చార అండ్ ప్ర­సార శాఖ మం­త్రి అశ్వి­ని వై­ష్ణ­వ్, గూ­గు­ల్‌ ప్ర­తి­ని­ధు­లు పా­ల్గొ­న్నా­రు. వి­శా­ఖ­లో పది బి­లి­య­న్ అమె­రి­క­న్ డా­ల­ర్ల (సు­మా­రు రూ.87,250)తో గూ­గు­ల్ 1 గి­గా­వా­ట్ హై­ప­ర్‌­స్కే­ల్ డేటా సెం­ట­ర్ క్యాం­ప­స్‌ ఏర్పా­టు­కు సం­బం­ధిం­చిన ఎం­ఓ­యు కు­దు­ర్చు­కు­న్నా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­నా­యు­డు, కేం­ద్ర సమా­చార, ప్ర­సార శాఖల మం­త్రి అశ్వ­నీ వై­ష్ణ­వ్, కేం­ద్ర ఆర్థి­క­మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్, రా­ష్ట్ర ఐటి, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి నారా లో­కే­ష్ సమ­క్షం­లో ఎపి ప్ర­భు­త్వ ప్ర­తి­ని­ధు­లు, గూ­గు­ల్ ఉన్న­త­స్థా­యి బృం­దం ఎం­ఓ­యు­పై సం­త­కా­లు చే­శా­రు. వి­శా­ఖ­లో 1 గి­గా­వా­ట్‌ సా­మ­ర్థ్యం­తో ఏర్పా­టు కా­ను­న్న డేటా సెం­ట­ర్‌.. ఆసి­యా­లో­నే గూ­గు­ల్ సం­స్థ­కు అతి­పె­ద్ద డేటా సెం­ట­ర్‌ గా ని­ల­వ­నుం­ది. అమె­రి­కా వె­లు­పల గూ­గు­ల్ ఏర్పా­టు చే­స్తు­న్న ఈ అతి­పె­ద్ద డేటా సెం­ట­ర్, గూ­గు­ల్‌ క్లౌ­డ్, ఏఐ వర్క్, సె­ర్చ్, యూ­ట్యూ­బ్ వంటి వాటి కోసం ఉప­యో­గ­ప­నుం­ది. ఈ డేటా సెం­ట­ర్ అం­దు­బా­టు­లో­కి వస్తే పరి­శ్ర­మ­లు, అం­కుర పరి­శ్ర­మ­లు, ప్ర­భు­త్వ అవ­స­రా­ల­కు అను­గు­ణం­గా ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ సే­వ­లు అం­దు­బా­టు­లో కి రా­ను­న్నా­యి.

అతిపెద్ద ఒప్పందం: చంద్రబాబు

ఐటీ ది­గ్గజ సం­స్థ గూ­గు­ల్‌.. వి­శా­ఖ­లో అడు­గు పె­డు­తోం­ద­ని చం­ద్ర­బా­బు అన్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో హై­టె­క్‌ సి­టీ­ని అభి­వృ­ద్ధి చే­శాం.. ప్ర­స్తు­తం వి­శా­ఖ­ను ఐటీ హబ్‌­గా తీ­ర్చి­ది­ద్ద­బో­తు­న్న­ట్లు తే­ల్చి చె­ప్పా­రు. వి­శా­ఖ­కు గూ­గు­ల్‌­ను తీ­సు­కొ­స్తు­న్నా­మన సీఎం చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. సాం­కే­తి­క­త­లో కొ­త్త ఆవి­ష్క­ర­ణ­లు రా­ను­న్నా­యి.. డి­జి­ట­ల్‌ కనె­క్టి­వి­టీ, డేటా సెం­ట­ర్‌, ఏఐ, రి­య­ల్‌­టై­మ్‌ డేటా కలె­క్ష­న్లు కీ­ల­క­మై­న­వి.. సాం­కే­తి­క­ను అం­ది­పు­చ్చు­కో­వ­డం­లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం ముం­దుం­టుం­ది.. 2047 నా­టి­కి వి­క­సి­త్‌ భా­ర­త్‌ మనం­ద­రి లక్ష్య­మ­ని తె­లి­ప­రు. అయి­తే, హా­ర్డ్‌ వర్క్‌ కాదు.. స్మా­ర్ట్‌ వర్క్‌ ని­నా­దా­న్ని తీ­సు­కొ­చ్చాం.. రా­బో­యే ఐదే­ళ్ల కా­లం­లో 15 బి­లి­య­న్‌ డా­ల­ర్లు ఖర్చు పె­డ­తా­మ­ని గూ­గు­ల్ చె­ప్ప­డం సం­తో­ష­దా­య­కం అని చం­ద్ర­బా­బు అన్నా­రు. ఈ గూ­గు­ల్ డేటా సెం­ట­ర్ ఏర్పా­టు­తో వి­శా­ఖ­ప­ట్నం ఇకపై AI సి­టీ­గా మా­ర­నుం­ది. డేటా సెం­ట­ర్‌ ద్వా­రా భా­ర­త్‌­లో ఏఐ ఆధా­రిత ట్రా­న్స్‌­ఫ­ర్మే­ష­న్‌­ను గూ­గు­ల్ సం­స్థ వే­గ­వం­తం చే­య­నుం­ది. గూ­గు­ల్‌ గ్లో­బ­ల్‌ నె­ట్‌­వ­ర్క్‌­తో సము­ద్ర గర్భ, భూ­భా­గ­పు కే­బు­ల్‌ కనె­క్టి­వి­టీ ద్వా­రా అను­సం­ధా­నిం­చి, క్లీ­న్‌ ఎన­ర్జీ­తో పని­చే­సే వి­ధం­గా ప్రా­జె­క్టు­ను రూ­ప­క­ల్పన చే­య­బ­డిం­ది. ఈ ప్రా­జె­క్ట్ 2028–2032 కా­లం­లో సగ­టున సం­వ­త్స­రా­ని­కి రూ.10,518 కో­ట్ల జీ­ఎ­స్‌­డీ­పీ వా­టా­తో­పా­టు సు­మా­రు 1,88,220 ఉద్యో­గా­ల­ను సృ­ష్టి­స్తుం­ది.

Tags

Next Story