CM Chandrababu : విజ్ఞానానికి కేంద్రంగా ఏపీ.. వైజాగ్‌కు గూగుల్.. చంద్రబాబు హాట్ కామెంట్

CM Chandrababu : విజ్ఞానానికి కేంద్రంగా ఏపీ.. వైజాగ్‌కు గూగుల్.. చంద్రబాబు హాట్ కామెంట్
X

ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలో గూగుల్ విశాఖ పట్నానికి రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. గూగుల్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అప్పట్లో ఐటీయే భవిష్యత్తు అని చెప్పానని, ఇప్పుడు కాలం మారిందని, క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన సాంకేతికతలు కీలకంగా మారాయని అన్నారు. ఇప్పుడు ఈ నూతన టెక్నాలజీలను ప్రోత్సహించడంపై దృష్టి సారించానని స్పష్టం చేశారు.

Tags

Next Story