AP ASSEMBLY: తిరుమల లడ్డూ అంశం.. నేడు అసెంబ్లీలో చర్చ

AP ASSEMBLY: తిరుమల లడ్డూ అంశం.. నేడు అసెంబ్లీలో చర్చ
X
వాస్తవాలు బయట పెడతామన్న మంత్రి నారా లోకేశ

తి­రు­మల శ్రీ­వా­రి ప్ర­సా­దం తయా­రీ­లో నె­య్యి బదు­లు రసా­య­నాల మి­శ్ర­మం వి­ని­యో­గం­పై అసెం­బ్లీ సా­క్షి­గా చర్చిం­చా­ల­ని కూ­ట­మి ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. మం­గ­ళ­వా­రం అసెం­బ్లీ­లో ఈ అం­శం­పై నా­లు­గు గం­ట­ల­పా­టు చర్చిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఈ మే­ర­కు సో­మ­వా­రం అమ­రా­వ­తి­లో సీఎం చం­ద్ర­బా­బు అధ్య­క్ష­తన జరి­గిన సమా­వే­శం­లో ఈ మే­ర­కు కీలక ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. అం­దు­కో­సం మం­గ­ళ­వా­రం ఉదయం ప్ర­శ్నో­త్త­రాల సమయం అనం­త­రం జీరో అవ­ర్‌­ను రద్దు చే­సిం­ది. రేపు ఉదయం 10.30 నుం­చి మధ్యా­హ్నం 2.00 గంటల వరకు నె­య్యి కల్తీ­పై చర్చిం­చా­ల­ని ఈ సమా­వే­శం­లో ని­ర్ణ­యిం­చా­రు. ఉదయం10.30 గంటల నుం­చి నె­య్యి కల్తీ పై కూ­ట­మి­లో­ని భా­గ­స్వా­మ్య పక్షా­లైన టీ­డీ­పీ, జన­సేన, బీ­జే­పీ­ల­కు చెం­దిన 10 మంది ఎమ్మె­ల్యే­ల­తో అసెం­బ్లీ­లో మా­ట్లా­డిం­చ­ను­న్నా­రు. ఇక డి­ప్యూ­టీ సీఎం పవన్ కల్యా­ణ్.. స్వ­ల్ప అస్వ­స్థ­త­కు గు­ర­య్యా­రు. ఆ కా­ర­ణం­గా ఆయన సో­మ­వా­రం అసెం­బ్లీ­కి హా­జ­రు­కా­లే­దు. రే­ప­టి సభలో లడ్డూ కల్తీ నె­య్యి అం­శం­పై డి­ప్యూ­టీ సీఎం పవన్ ఈ చర్చ­లో పా­ల్గొ­నే అవ­కా­శం ఉంది. అనం­త­రం మధ్యా­హ్నం 12.30 గంటల నుం­చి కల్తీ నె­య్యి­పై సీఎం చం­ద్ర­బా­బు ప్ర­క­టన చే­య­ను­న్నా­రు.

మరో­వై­పు తి­రు­మల తి­రు­ప­తి దే­వ­స్థా­నం (టీ­టీ­డీ) ని­బం­ధ­న­లు మరింత కఠి­న­త­రం చే­యా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వం ని­ర్ణ­యిం­చిం­ది. ఈ ని­బం­ధ­న­లు ప్ర­కా­రం అన్య­మ­త­స్థు­లు శ్రీ­వా­రి దర్శ­నం చే­సు­కో­వా­లం­టే.. డి­క్ల­రే­ష­న్ ఇవ్వా­ల­నే ని­బం­ధ­న­ను ఇకపై తప్ప­ని­స­రి­గా అమలు చే­యా­లం­టూ ప్ర­భు­త్వం ఆదే­శా­లు ఇవ్వ­నుం­ది. అమృ­త­స­ర్‌­లో స్వ­ర్ణ దే­వా­ల­యా­ని­కి ఉన్న ప్ర­త్యేక చట్టం వలే టీ­టీ­డీ­కు సైతం చట్టం తీ­సు­కు­రా­వా­ల­ని ప్ర­భు­త్వం భా­వి­స్తుం­ది.

Tags

Next Story