AP Assembly : ఏపీ అసెంబ్లీకి విద్యార్థులు.. అయ్యన్న స్పెషల్ ఆఫర్

AP Assembly : ఏపీ అసెంబ్లీకి విద్యార్థులు.. అయ్యన్న స్పెషల్ ఆఫర్
X

ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సారిగా విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు వీక్షించే అవకాశాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కల్పించారు. సమావేశాలు ప్రారంభం నాటి నుంచి రోజూ సుమారు వంద మంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. గత మూడు రోజులుగా వివిధ కళాశాలల నుండి విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు వీక్షిస్తున్నారు.

నాలుగో రోజు అసెంబ్లీ సమావేశం లో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 మంది సమావేశాలు స్వయంగా వీక్షించారు. స్వయంగా అసెంబ్లీ సమావేశాలు వీక్షించడం సంతోషంగా ఉందని తెలిపారు విద్యార్థులు.

టీవీలలో చూడటం తప్ప స్వయంగా వచ్చి ఈ అసెంబ్లీ సమావేశాలు చూడటం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన స్పీకర్ అయ్య న్నపాత్రుడుకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story