AP: ఏపీలో నేటి నుంచే ఆటో డ్రైవర్ సేవలో

AP: ఏపీలో నేటి నుంచే ఆటో డ్రైవర్ సేవలో
X
కాసేపట్లో కొత్త పథకం ప్రారంభించనున్న కూటమి సర్కార్.. విజయవాడలో "ఆటో డ్రైవర్ సేవలో.." ఆరంభం.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో కూ­ట­మి ప్ర­భు­త్వం సం­క్షే­మం ది­శ­గా మరో అడు­గు వే­సిం­ది. నేడు మరో కొ­త్త పథ­కా­న్ని అమ­ల్లో­కి తీ­సు­కొ­స్తుం­ది. రా­ష్ట్రం­లో­ని డ్రై­వ­ర్ల సం­క్షే­మం కోసం ‘ఆటో డ్రై­వ­ర్ సే­వ­లో…’ పథ­కా­ని­కి శ్రీ­కా­రం చు­ట్టిం­ది. ఏపీ­లో సొంత ఆటో రి­క్షా, మో­టా­ర్ క్యా­బ్, మ్యా­క్సీ క్యా­బ్ డ్రై­వ­ర్ల­కు ఆర్థి­కం­గా అం­డ­గా ని­ల­బ­డేం­దు­కు కూ­ట­మి ప్ర­భు­త్వం ప్ర­తి­ష్టా­త్మ­కం­గా ఈ పథ­కా­న్ని తీ­సు­కొ­చ్చిం­ది. ఈ పథకం కింద అర్హు­లైన డ్రై­వ­ర్ల­కు ఏడా­ది­కి రూ.15 వేల చొ­ప్పున ఆర్ధిక సహా­యం అం­దిం­చ­నుం­ది. అయి­తే, ఈ ఆటో డ్రై­వ­ర్ సే­వ­లో పథ­కా­న్ని­నే­డు ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. వి­జ­య­వాడ సెం­ట్ర­ల్ ని­యో­జ­క­వ­ర్గ పరి­ధి­లో ఉదయం 11 గం­ట­ల­కు జర­గ­ను­న్న ఈ కా­ర్య­క్ర­మం­లో ఉప ము­ఖ్య­మం­త్రి పవన్ కళ్యా­ణ్, వి­ద్యా శాఖ మం­త్రి నారా లో­కే­ష్ తో పాటు ఏపీ బీ­జే­పీ రా­ష్ట్ర అధ్య­క్షు­డు మా­ధ­వ్ హా­జ­రు కా­ను­న్నా­రు. భారీ సంఖ్యలో ఆటో డ్రైవర్లు కూడా ఈ సభలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

ప్రతి ఏటా ఒక్కొక్కరికి రూ. 15 వేలు

ఏపీ­లో­ని ఆటో డ్రై­వ­ర్ల­కు ప్ర­తి ఏటా రూ.15వేలు చొ­ప్పున అం­ద­జే­య­ను­న్నా­రు. సొంత ఆటో రి­క్షా, మో­టా­ర్ క్యా­బ్, మ్యా­క్సీ క్యా­బ్ డ్రై­వ­ర్ల­కు ఆర్థి­కం­గా అం­డ­గా ని­ల­బ­డేం­దు­కు ఆటో డ్రై­వ­ర్ సే­వ­లో పథకం రూ­పొం­దిం­చిం­ది. ఈ పథకం కింద మొ­త్తం 3,10,385 మంది అర్హుల జా­బి­తా సి­ద్ధం చే­శా­రు. క్షే­త్ర స్థా­యి పరి­శీ­లన తరు­వాత అర్హుల జా­బి­తా ఖరా­రు చే­శా­రు. ఏపీ ప్ర­భు­త్వం­పై రూ.466 కో­ట్ల భారం పడ­నుం­ది. స్త్రీ శక్తి పథకం వల్ల జీ­వ­నో­పా­ధి ఇబ్బం­ది ఎదు­రైన ఆటో, క్యా­బ్ డ్రై­వ­ర్ల­కు ఆర్థిక సాయం అం­ది­స్తా­మ­ని చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. ఆటో డ్రై­వ­ర్ల సే­వ­లో పథకం స్టే­ట­స్ చెక్ చే­సు­కో­వ­డా­ని­కి ప్ర­భు­త్వం అవ­కా­శం కల్పిం­చిం­ది. ఆటో డ్రై­వ­ర్‌ల కోసం ప్రా­రం­భిం­చ­బో­తు­న్న పథకం జా­బి­తా­లో పేరు ఉందో లేదో స్టే­ట­స్ తె­లు­సు­కో­వ­చ్చు. ఈ పథకం స్టే­ట­స్ చెక్ చే­య­డా­ని­కి లా­గి­న్ అవ­స­రం లేదు. ఆటో, క్యా­బ్ డ్రై­వ­ర్లు ఆధా­ర్ కా­ర్డ్ నం­బ­ర్‌­తో చెక్ చే­సు­కో­వ­చ్చు. గత ప్ర­భు­త్వం ఆటో డ్రై­వ­ర్ల­కు కే­వ­లం ఏడా­ది­కి రూ.10 వేలు మా­త్ర­మే ఇచ్చిం­ది. కానీ కూ­ట­మి ప్ర­భు­త్వం గత పా­ల­కు­ల­కం­టే 50 శాతం అద­నం­గా రూ.15 వేలు ఇస్తోం­ది.

భారీగా పెరిగిన లబ్దిదారుల సంఖ్య

గత ప్ర­భు­త్వం­లో 2,61,516 మం­ది­ని అర్హు­లు­గా గు­ర్తిం­చి రూ.261.51 కో­ట్లే ఖర్చు చే­య­గా.. ఈసా­రి లబ్ధి­దా­రుల సం­ఖ్య మరో 30 వేలు పె­రి­గిం­ది. అలా­గే డ్రై­వ­ర్ల­కు రూ.175 కో­ట్లు అద­నం­గా లబ్ధి చే­కూ­ర­నుం­ది. ఈ పథ­కం­లో ఆటో డ్రై­వ­ర్లు 2,25,621 మంది, త్రీ వీ­ల­ర్ ప్యా­సిం­జ­ర్ వా­హ­నాల డ్రై­వ­ర్లు 38,576 మంది, మో­టా­ర్ క్యా­బ్ డ్రై­వ­ర్లు 20,072 మంది, మ్యా­క్సి క్యా­బ్ డ్రై­వ­ర్లు 6,400 మంది ఉన్నా­రు. వి­శా­ఖ­ప­ట్నం జి­ల్లా­లో అత్య­ధి­కం­గా 22,955 మంది డ్రై­వ­ర్ల­కు లబ్ధి కల­గ­నుం­ది. ఈ పథకం అమలు సం­ద­ర్భం­గా అధి­కా­రు­లు, డ్రై­వ­ర్ సం­ఘా­లు, ప్ర­జా­ప్ర­తి­ని­ధుల మధ్య సమ­న్వ­యం పెం­చి దీ­న్ని వి­జ­య­వం­తం చే­యా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు సూ­చిం­చా­రు. అర్హ­తల వి­ష­యం­లో జా­గ్ర­త్త­గా పరి­శీ­లన చేసి, అర్హు­లైన ప్ర­తి ఒక్క­రి­కి ఆర్థిక సాయం అం­దా­ల­ని పే­ర్కొ­న్నా­రు.

విశాఖలోనే అత్యధికం

వి­శా­ఖ­ప­ట్నం జి­ల్లా­లో అత్య­ధి­కం­గా 22, 955 మంది డ్రై­వ­ర్ల­కు లబ్ధి చే­కూ­ర­గా.. ఫి­ర్యా­దుల కోసం ప్ర­త్యేక వ్య­వ­స్థ­ను ప్ర­భు­త్వం ఏర్పా­టు చే­సిం­ది. అర్హు­లైన ప్ర­తి లబ్ధి­దా­రు­డి­కి పథకం అం­దే­లా చే­యా­ల­ని అధి­కా­రు­ల­కు సర్కా­ర్ నుం­చి స్ప­ష్ట­మైన ఆదే­శా­లు వచ్చా­యి. అర్హత ఉండి కూడా జా­బి­తా­లో పేరు లే­కుం­టే.. వారి సమ­స్య­ను పరి­ష్క­రిం­చిన వెం­ట­నే లబ్ధి­దా­రుల జా­బి­తా­లో చే­ర్చేం­దు­కు ఏర్పా­ట్లు చే­శా­రు. ఫి­ర్యా­దు­లు స్వీ­క­రిం­చేం­దు­కు ప్ర­భు­త్వం ఓ వ్య­వ­స్థ­ను ఏర్పా­టు చే­య­గా.. లబ్ధి­దా­రు­లు తప్ప­ని­స­రి­గా ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో చె­ల్లు­బా­టు అయ్యే డ్రై­విం­గ్ లై­సె­న్స్, రి­జి­స్ట్రే­ష­న్ కలి­గి ఉం­డా­ల­ని కూ­ట­మి ప్ర­భు­త్వం స్ప­ష్టం చే­సిం­ది.

Tags

Next Story