AP BUDGET: ప్రజా రాజధాని అమరావతికి మహర్దశ

AP BUDGET: ప్రజా రాజధాని అమరావతికి మహర్దశ
X
రాజధానికి పెద్దపీట వేసిన వార్షిక బడ్జెట్,.. అభివృద్ధి పనుల కోసం రూ.6 వేల కోట్లు.. స్పెషల్ ఎకనామిక్ జోన్కు 28 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌లో ప్రజా రాజధాని అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రాజధాని నిర్మాణానికి మళ్లీ ఊపిరి పోసేలా ప్రభుత్వం భారీ కేటాయింపులు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. “అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి” అనే సందేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాజధాని ప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, ప్రభుత్వ భవనాలు, డ్రైనేజ్, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాల విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి సభలో వెల్లడించారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, ఆర్థిక, విద్యా, ఐటీ, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇందులో రాజధాని అమరావతికి పెద్దపీట వేశారు. క్యాపిటల్ సిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలకు హబ్‌గా ఉన్న విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు రూ. 28 వేల కోట్లు కేటాయించారు. ఇక నారా లోకేశ్ మంత్రిగా ఉన్న విద్యా శాఖకు రూ.32,308 కోట్లు ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బడ్జె­ట్‌­లో ఎస్సీ, ఎస్టీ, బీ­సీ­ల­కు సం­క్షే­మా­ని­కి పె­ద్ద­పీట వే­సిం­ది. సమా­జీక వర్గా­లు, మై­నా­ర్టీ వర్గాల అభి­వృ­ద్ధి కోసం ఈ బడ్జె­ట్‌­లో భా­రీ­గా ని­ధు­లు కే­టా­యి­స్తూ ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. బీసీ కాం­పో­నెం­ట్ కోసం ఏకం­గా రూ. 51,021 కో­ట్లు కే­టా­యిం­చ­డం ఆ వర్గాల పట్ల ప్ర­భు­త్వా­ని­కి ఉన్న చి­త్త­శు­ద్ధి­ని చా­టి­చె­బు­తోం­ది. అలా­గే ఎస్సీ కాం­పో­నెం­ట్ కోసం రూ. 20,644 కో­ట్లు, ఎస్టీ కాం­పో­నెం­ట్ కోసం రూ. 9,190 కో­ట్లు. మై­నా­ర్టీ వర్గాల సం­క్షే­మం కోసం రూ. 6,090 కో­ట్లు కే­టా­యిం­చి ప్ర­భు­త్వం ఆయా వర్గా­ల­కు భారీ శు­భ­వా­ర్త వి­ని­పిం­చిం­ది. మౌ­లిక సదు­పా­యాల కల్ప­న­కు కూడా బడ్జె­ట్‌­లో తగిన ప్రా­ధా­న్యత లభిం­చిం­ది. రా­ష్ట్రం­లో­ని పే­ద­లం­ద­రి­కీ సొం­తిం­టి కలను నిజం చేసే లక్ష్యం­తో గృహ ని­ర్మాణ శా­ఖ­కు రూ. 6,357 కో­ట్లు కే­టా­యిం­చా­రు. అలా­గే ప్ర­జా­ర­వా­ణా, రహ­దా­రు­లు, భవ­నాల శా­ఖ­కు రూ. 9,856 కో­ట్లు కే­టా­యిం­చ­డం ద్వా­రా రా­ష్ట్ర­వ్యా­ప్తం­గా కనె­క్టి­వి­టీ­ని పెం­చేం­దు­కు ప్ర­భు­త్వం సి­ద్ధ­మైం­ది. అట్ట­డు­గు వర్గాల జీవన ప్ర­మా­ణా­లు మె­రు­గు­ప­ర­చ­డ­మే కా­కుం­డా, మె­రు­గైన మౌ­లిక సదు­పా­యా­లు కల్పిం­చ­డం ద్వా­రా రా­ష్ట్ర ప్ర­గ­తి­కి ఈ బడ్జె­ట్ బా­ట­లు వే­య­నుం­ది.

Tags

Next Story