AP: నేడు ఏపీ కేబినెట్ భేటీ

AP: నేడు ఏపీ కేబినెట్ భేటీ
X
పాక్‌పై దాడులు సహా కీలక అంశాలపై చర్చ

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనుంది. 47 వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై గురువారం క్యాబినెట్‌లో చర్చ జరగనుంది. ప్రధాని మోడీ సభ విజయవంతంపై సీఎం చంద్రబాబు మంత్రులతో డిస్కస్ చేయనున్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. క్యాబినెట్‌లో తీర ప్రాంత భద్రతపై ప్రత్యేక చర్చ జరగనుంది.

ఆపరేషన్ సిందూర్‌పై చంద్రబాబు కాన్ఫరెన్స్

ఆపరేషన్ సిందూర్‌పై సీఎం చంద్రబాబు అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తప్పుడు ప్రచారం జరగకుండా చూడాలన్నారు. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రం సూచనలను పూర్తిగా అమలు చేయాలని, ముఖ్యంగా TTD వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags

Next Story