AP Cabinet Meeting: చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేేటీ

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ, ఆర్టీజీని పునర్వ్యవస్థీకరించే అంశం, మారిటైం పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. 41వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలపనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచీ గుబురు గడ్డంతో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన లుక్ మార్చారు. పూర్తిగా గడ్డం తీసేసి గుబురు మీసంతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ కేబినెట్ భేటీకి వచ్చారు. దీంతో ఆయన కేబినెట్ సహచరులు కూడా ఆయన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. తన తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ కారణంగా పవన్ ఈ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com