AP Cabinet Meeting : ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు, అమరావతిలో రూ.2,733 కోట్ల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు భవన నిర్మాణాలు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిని 100 పడకలకు పెంచడం, పత్తిపాడులో 100 పడకల ఈఎస్ఐ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. నంద్యాల, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకరించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరిగినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com