AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
X

ఏపీ క్యాబినెట్ ఈరోజు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. సీఆర్‌డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు 4వ సమావేశంలో ఆమోదించిన అంశాలపైనా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో, సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఆమోదించనున్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపట్టనున్న వివిధ మౌలిక సదుపాయాల పనులకు ఈ సమావేశంలో తుది ముద్ర వేయనున్నారు. ఈ పనులు పూర్తి అయితే రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

అమరావతి పున: ప్రారంభ పనుల ఆరంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పీఎంతో ఆయన బుధవారం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులు, అమరావతికి సాయం సహా వివిధ అంశాలపై ఆయన మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సహా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారని సమాచారం.

Tags

Next Story