AP Cabinet : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. పోలవరం డయాఫ్రం వాల్‌పై తీర్మానం!

సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. పోలవరం డయాఫ్రం వాల్‌కు సంబంధించి క్యాబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు.
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్2024-25ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. యూనియన్ బడ్జెట్‌లో ఏపీ మంచి కేటాయింపులే దక్కాయి.. బడ్జెట్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com