AP: నేడు ఏపీ కేబినెట్ భేటీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ CRDA ఆమోదించిన రూ.37,072 కోట్ల టెండర్ల పనులకు చేపట్టేందుకు ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15, 081 కోట్ల పనులు, పలు సంస్థలకు అమరావతిలో భూ కేటాయింపులకు, 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ అమోదంతో టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సీఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయనుంది. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు ఆమోదం తెలపనుంది. మున్సిపల్ శాఖ లోని పలు ఎజెండాలకు, 4వ ఎస్ఐపిబి మీటింగ్ అమోదం తెలిపిన వాటికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదించనుంది.
చంద్రబాబు కీలక ఆదేశాలు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా డయేరియా ప్రబలుతోంది. శని, ఆదివారాల్లో సుమారు 25 మంది వాంతులు, విరేచనాలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)లో చేరారు. దీంతో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.
18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఈ నెల 18వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో అమరావతి పనుల పున: ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అలాగే అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్రమంత్రులను కూడా కలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com