AP CABINET: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి

AP CABINET: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి
X
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం ## అమరావతిలో రూ. 212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణం

ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు అధ్య­క్ష­తన సచి­వా­ల­యం­లో జరి­గిన ఆం­ధ్ర­ప్ర­దే­శ్ మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. రా­ష్ట్రం­లో అతి­పె­ద్ద వి­దే­శీ పె­ట్టు­బ­డి గూ­గు­ల్ డాటా సెం­ట­ర్ తో సహా రూ.1,14,824 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఆమో­దం తె­ల­పిం­ది. వి­శా­ఖ­ప­ట్నం­లో రై­డె­న్ ఇన్ఫో­టె­క్ మెగా డేటా సెం­ట­ర్, అమ­రా­వ­తి అభి­వృ­ద్ధి ప్రా­జె­క్టు­లు, ఉద్యో­గుల డీఏ పెం­పు వంటి కీలక అం­శా­ల­పై ని­ర్ణ­యా­లు తీ­సు­కు­న్నా­రు. ఈ సమా­వే­శం­లో మొ­త్తం 26 ప్రా­జె­క్టు­ల­కు ఆమో­దం ఇచ్చా­రు. సమా­వే­శం తర్వాత మం­త్రి పా­ర్థ­సా­ర­థి మీ­డి­యా­కు వి­వ­రా­లు వె­ల్ల­డిం­చా­రు. సమా­వే­శం­లో అతి పె­ద్ద ని­ర్ణ­యం వి­శా­ఖ­ప­ట్నం­లో రై­డె­న్ ఇన్ఫో­టె­క్ ప్రై­వే­ట్ లి­మి­టె­డ్ చేత ఏర్పా­టు చేసే హై­ప­ర్‌­స్కే­ల్ డేటా సెం­ట­ర్‌­కు ఆమో­దం. ఈ ప్రా­జె­క్టు­కు రూ.87,520 కో­ట్ల పె­ట్టు­బ­డి పె­డ­తా­రు. ఇది భా­ర­త­దే­శం­లో అతి­పె­ద్ద ఎఫ్‌­డీ­ఐ­ల­లో ఒక­టి­గా ని­లు­స్తుం­ది. ఈ డేటా సెం­ట­ర్ ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్ (ఏఐ), క్లౌ­డ్ కం­ప్యూ­టిం­గ్, డేటా అన­లి­టి­క్స్ రం­గా­ల్లో గ్లో­బ­ల్ హబ్‌­గా మా­రు­తుం­ది. దీని ద్వా­రా 67,218 మం­ది­కి ఉద్యో­గా­లు లభి­స్తా­య­ని అం­చ­నా. "వై­జా­గ్‌­ను 'ఏఐ సి­టీ­'­గా తయా­రు చే­య­డ­మే లక్ష్యం" అని ప్ర­భు­త్వం చె­బు­తోం­ది. మరో 26 ప్రా­జె­క్టు­ల­కు మొ­త్తం రూ.27,304 కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­కు ఆమో­దం ఇచ్చా­రు. ఇవి ఐటీ, మా­న్యు­ఫా­క్చ­రిం­గ్, ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చ­ర్ రం­గా­ల్లో ఉం­టా­యి.

ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా..

ఏపీ­లో రూ. 1.17 లక్షల కో­ట్ల వి­లు­వైన భారీ పె­ట్టు­బ­డుల ప్ర­తి­పా­ద­న­ల­కు ఆమో­ద­ము­ద్ర వే­సి­న­ట్టు తె­లు­స్తోం­ది. ఈ ని­ర్ణ­యం రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ­కు కొ­త్త ఊతా­న్ని ఇవ్వ­డం­తో పాటు, వే­లా­ది ఉద్యో­గాల కల్ప­న­కు మా­ర్గం సు­గ­మం చే­స్తుం­ద­ని ప్ర­భు­త్వం వి­శ్వా­సం వ్య­క్తం చే­స్తోం­ది. రా­ష్ట్ర భవి­ష్య­త్తు­ను దృ­ష్టి­లో ఉం­చు­కు­ని తీ­సు­కు­న్న ఈ ని­ర్ణ­యా­లు పా­రి­శ్రా­మిక రం­గం­లో ఏపీ­ని అగ్ర­స్థా­నం­లో ని­ల­బె­డ­తా­య­ని భా­వి­స్తు­న్నా­రు. ఈ కే­బి­నె­ట్ సమా­వే­శం­లో వి­శా­ఖ­ప­ట్నం అభి­వృ­ద్ధి­పై ప్ర­త్యే­కం­గా దృ­ష్టి సా­రిం­చా­రు. వి­శా­ఖ­ను దేశ ఆర్థిక రా­జ­ధా­ని ముం­బై తర­హా­లో ఒక శక్తి­వం­త­మైన ఆర్థిక, సాం­కే­తిక కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దా­ల­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు ఆకాం­క్షిం­చా­రు. ఇప్ప­టి­కే గూ­గు­ల్, టీ­సీ­ఎ­స్ వంటి ప్ర­పంచ ప్ర­ఖ్యాత టెక్ ది­గ్గ­జా­లు వి­శా­ఖ­కు వస్తు­న్నా­య­ని, నగ­రా­న్ని ఒక అం­త­ర్జా­తీయ ఐటీ హబ్‌­గా మా­ర్చ­డ­మే లక్ష్య­మ­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు.

అమరావతి నిర్మాణ పనులకు వేగం

రా­జ­ధా­ని అమ­రా­వ­తి ని­ర్మాణ పను­ల­ను వే­గ­వం­తం చేసే ది­శ­గా కూడా కే­బి­నె­ట్ కీలక ని­ర్ణ­యా­లు తీ­సు­కుం­ది. అమ­రా­వ­తి­లో రూ. 212 కో­ట్ల అం­చ­నా వ్య­యం­తో నూతన రా­జ్‌­భ­వ­న్ ని­ర్మా­ణా­ని­కి పరి­పా­లన అను­మ­తు­లు మం­జూ­రు చే­సిం­ది. దీం­తో పాటు, రా­జ­ధా­ని పరి­ధి­లో­ని మం­గ­ళ­గి­రి, తా­డే­ప­ల్లి ము­న్సి­ప­ల్ కా­ర్పొ­రే­ష­న్ల­లో భూ­గ­ర్భ డ్రై­నే­జీ వ్య­వ­స్థ ఏర్పా­టు­కు అవ­స­ర­మైన ని­ధు­ల­లో 25% సీ­ఆ­ర్డీఏ (CRDA) ద్వా­రా కే­టా­యిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. ఈ చర్య­ల­తో రా­జ­ధా­ని ప్రాం­తం­లో మౌ­లిక వస­తుల కల్పన మరింత ముం­దు­కు సా­గ­నుం­ది. వీ­టి­తో పాటు పలు సం­స్థ­ల­కు అవ­స­ర­మైన భూ కే­టా­యిం­పు­లు, ప్ర­భు­త్వ ఉద్యో­గు­ల­కు సం­బం­ధిం­చిన కరు­వు భత్యం (డీఏ) వంటి అం­శా­ల­పై కూడా సమా­వే­శం­లో వి­స్తృ­తం­గా చర్చిం­చా­రు. ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు మా­ట్లా­డు­తూ, కే­వ­లం పె­ట్టు­బ­డు­ల­కు ఆమో­దం తె­ల­ప­డ­మే కా­కుం­డా, ఆయా సం­స్థ­లు క్షే­త్ర­స్థా­యి­లో తమ కా­ర్య­క­లా­పా­ల­ను వే­గం­గా ప్రా­రం­భిం­చే­లా చూ­డా­ల్సిన బా­ధ్యత సం­బం­ధిత శాఖల మం­త్రు­ల­పై ఉం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. "రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­లు తీ­సు­కు­రా­వ­డా­ని­కి ఎంతో కష్ట­ప­డు­తు­న్నాం. ఈ ప్ర­ణా­ళి­కల ఫలా­లు ప్ర­జ­ల­కు చే­రే­లా, వాటి ప్రా­ము­ఖ్య­త­ను వా­రి­కి అర్థ­మ­య్యే­లా వి­వ­రిం­చా­లి," అని ఆయన ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ప్ర­భు­త్వ పథ­కా­లు, అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­పై ప్ర­జ­ల­కు అవ­గా­హన కల్పిం­చ­డం­లో మం­త్రు­లు చు­రు­కైన పా­త్ర పో­షిం­చా­ల­ని ఆయన సూ­చిం­చా­రు.

వెస్ట్‌లో ముంబై తరహాలో ఈస్ట్‌లో విశాఖ..

ఆర్సె­లా­ర్‌ మి­త్త­ల్‌ ప్లాం­ట్‌­కు త్వ­ర­లో శం­కు­స్థా­పన చే­య­బో­తు­న్న­ట్లు సీఎం చం­ద్ర­బా­బు ప్ర­క­టిం­చా­రు. వి­శా­ఖ­ను ముం­బై లాగా అభి­వృ­ద్ధి చే­స్తా­మ­ని పే­ర్కొ­న్నా­రు. పం­చా­యి­తీ రా­జ్‌­లో పం­చా­య­తీ­లు రే­ష­న­లై­జే­ష­న్ చేసి రూ­ర­ల్, అర్బ­న్ పం­చా­యి­తీ­లు­గా చే­యా­ల­ని తె­లి­పా­రు. 2028 నా­టి­కి వై­జా­గ్ దే­శం­లో ఒక ప్ర­త్యేక సి­టీ­గా ఉం­డ­బో­తుం­ద­ని చం­ద్ర­బా­బు ఆశా­భా­వం వ్య­క్తం చే­శా­రు. ఐటీ రం­గం­లో లక్ష­లా­ది ఉద్యో­గా­లు రా­బో­తు­న్నా­య­ని పే­ర్కొ­న్నా­రు. వె­స్ట్‌­లో ముం­బై తర­హా­లో ఈస్ట్‌­లో వి­శాఖ అభి­వృ­ద్ధి చెం­ద­బో­తుం­ద­న్నా­రు. ప్ర­స్తు­తం వర్క్ ఫ్ర­మ్ హో­మ్‌­లో 4 లక్షల 70 వేల మంది ఆం­ధ్రా­లో పని చే­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు. దీ­ని­ని 10 లక్ష­ల­కు పెం­చా­ల­ని అధి­కా­రు­ల­కు చె­ప్పి­న­ట్లు చం­ద్ర­బా­బు స్ప­ష్టం చే­శా­రు.

Tags

Next Story