AP: సీఎంకే లీగల్‌ నోటీసులు ఇచ్చిన సీఐ

AP: సీఎంకే లీగల్‌ నోటీసులు ఇచ్చిన సీఐ
X
వెనుక అదృశ్య శక్తులు ఉన్నాయన్న టీడీపీ

మాజీ మం­త్రి వై­ఎ­స్‌ వి­వే­కా­నం­ద­రె­డ్డి హత్య జరి­గి­న­ప్పు­డు పు­లి­వెం­దుల సీ­ఐ­గా ఉన్న శం­క­ర­య్య ఏకం­గా ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు­కే లీ­గ­ల్‌ నో­టీ­సు­లు పం­పిం­చా­రు. వి­వే­కా హత్య కే­సు­లో తన వ్య­క్తి­గత ప్ర­తి­ష్ఠ­కు భంగం కలి­గిం­చే­లా దు­రు­ద్దే­శ­పూ­రి­తం­గా చం­ద్ర­బా­బు పలు­మా­ర్లు తప్పు­డు ప్ర­క­ట­న­లు చే­శా­ర­ని ఆరో­పి­స్తూ న్యా­య­వా­ది జి.ధర­ణే­శ్వ­ర­రె­డ్డి ద్వా­రా ఈ నెల 18న నో­టీ­సు­లు పం­పా­రు. అవి తా­జా­గా వె­లు­గు­లో­కి వచ్చా­యి. అసెం­బ్లీ­లో తనకు బహి­రంగ క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­ల­ని, తన ప్ర­తి­ష్ఠ­కు నష్టం కలి­గిం­చి­నం­దు­కు రూ.1.45 కో­ట్ల పరి­హా­రం చె­ల్లిం­చా­ల­ని శం­క­ర­య్య ఆ నో­టీ­సు­ల్లో పే­ర్కొ­న్నా­రు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

సీఐ శంకరయ్య సమక్షంలోనే...

2019 మా­ర్చి­లో వి­వే­కా­నం­ద­రె­డ్డి హత్య జరి­గి­న­ప్పు­డు పు­లి­వెం­దుల సీ­ఐ­గా ఉన్న జె.శం­క­ర­య్య సమ­క్షం­లో­నే నిం­ది­తు­లు ఆధా­రా­లు ధ్వం­సం చే­శా­ర­ని, రక్త­పు మర­క­లు కడి­గే­శా­ర­ని చం­ద్ర­బా­బు పలు­మా­ర్లు ఆరో­పిం­చా­రు. విధి ని­ర్వ­హ­ణ­లో ని­ర్ల­క్ష్యం­గా వ్య­వ­హ­రిం­చా­రం­టూ 2019లోనే శం­క­ర­య్య­ను ప్ర­భు­త్వం సస్పెం­డ్‌ చే­సిం­ది. ‘వి­వే­కా హత్య­పై కేసు నమో­దు చే­య­క్క­ర్లే­దం­టూ కడప ఎంపీ అవి­నా­ష్‌­రె­డ్డి, ఆయన అను­చ­రు­డు దే­వి­రె­డ్డి శి­వ­శం­క­ర్‌­రె­డ్డి నన్ను బె­ది­రిం­చా­రు. మృ­త­దే­హా­న్ని పో­స్టు­మా­ర్టా­ని­కి పం­పిం­చొ­ద్ద­ని, మృ­త­దే­హం­పై గా­యా­లు­న్నా­య­ని ఎవ­రి­కీ చె­ప్పొ­ద్ద­ని నన్ను భయ­పె­ట్టా­రు’ అని శం­క­ర­య్య తొ­లుత సీ­బీ­ఐ­కి వాం­గ్మూ­ల­మి­చ్చా­రు. అయి­తే మే­జి­స్ట్రే­ట్‌ ఎదుట వాం­గ్మూ­లం నమో­దు చే­య­డా­ని­కి రా­కుం­డా తనకు వేరే పను­లు­న్నా­యం­టూ దా­ట­వే­శా­రు. ఆ తర్వాత వారం రో­జు­ల్లో­నే ఆయ­న­పై సస్పె­న్ష­న్‌­ను నాటి వై­సీ­పీ ప్ర­భు­త్వం ఎత్తే­సిం­ది. నిం­ది­తు­లు ప్ర­భా­వి­తం చే­య­టం వల్లే శం­క­ర­య్య మాట మా­ర్చా­ర­ని సీ­బీఐ న్యా­య­స్థా­నాల దృ­ష్టి­కి తీ­సు­కొ­చ్చిం­ది. ఈ నే­ప­థ్యం­లో ఇప్పు­డు శం­క­ర­య్య ఏకం­గా ము­ఖ్య­మం­త్రి­కే లీ­గ­ల్‌ నో­టీ­సు­లి­వ్వ­టం చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది.

వెనుక వివేకా హంతకులు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఐ శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్‌ నోటీస్‌ పంపడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వివేకా హంతకులే శంకరయ్యను నడిపిస్తున్నారు. ఈ నీచమైన ఘటనపై లోతైన విచారణ చేసి, సీఐని సస్పెండ్‌ చేయాలని డీజీపీని కోరుతున్నా. ఈ విషయాన్ని అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు తీసుకెళ్తాం’’ అని ఎమ్మెల్యే ఆది స్పష్టం చేశారు.

Tags

Next Story