AP Ration Mafia: ఏపీ రేషన్‌ మాఫియాపై సీఐడీ విచారణ షురూ..

AP Ration Mafia: ఏపీ రేషన్‌ మాఫియాపై సీఐడీ విచారణ షురూ..
X
బియ్యం దొంగల భరతం పట్టే స్పెషల్‌ ఆపరేషన్‌..

రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న టన్నుల కొద్ది రేషన్ బియ్యాన్ని ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అధికారులు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయినా అక్రమార్కులు ఆగడం లేదు. యదేచ్ఛగా రేషన్ బియ్యాన్ని అక్రమం తరలిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రెండు జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ తరలింపును అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం, కడప జిల్లాల్లో భారీగా రేషన్ బియ్యం తరలించే ప్రయత్నం చేశారు. రైస్ మిల్లుల కేంద్రం జరుగుతున్న ఈ గుట్టును రట్టు చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో 1500 బస్తాల రేషన్ బియ్యంను గుర్తించారు. వియత్నాంకు ఎగుమతి చేసేందుకు రైస్ మిల్లు రెడీ చేసింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మిల్లుపై దాడి చేశారు. 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మిల్లును సీజ్ చేసినట్లు సమాచారం. అటు కడప జిల్లాలోనూ ఇదే తంతు జరుగుతోంది. మైదుకూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నై పోర్టు కు లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం లారీని మైదుకూరు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కీలక నిర్ణయం

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా ఉన్నారని.. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంతో రైస్ మిల్లర్ల అసోసియేషన్ కలిసి పని చేయాలన్నారు. రైతులెవరు ఆందోళన చెందవద్దని.. రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొంటామని స్పష్టం చేశారు. పది రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.

అయిదు రోజుల్లో ఉత్తరాంధ్ర పర్యటన

ఐదు రోజులు ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని.. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. 229 కోట్ల సొమ్ములు 24 గంటల్లో రైతుఖాతాలో జమ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ సమయానికి కేవలం 2092 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదని వెల్లడించారు. విశాఖ, కృష్ణ పట్నం పోర్టుల కంటే రెండింతల బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళిపోయిందని తెలిపారు. కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం తరలింపులో కొందరు సీనియర్ అధికారులు ఉన్నారని.. అదే బాధ కలిగించిందన్నారు. వైసీపీ హయంలో పోర్టులను స్మగ్లింగ్ డన్‌గా మార్చేశారని విమర్శించారు.

Tags

Next Story