CBN: రోడ్లపై గుంతలు కనపడొద్దు

జగన్ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో ఆంధ్ర ప్రజలు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేయాలని రోడ్లు భవనాల శాఖను చంద్రబాబు ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్ విద్యుత్ ప్లాంట్ల నుంచివచ్చే ప్లైయాష్ వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. శాస్త్ర, ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర రహదారులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీరింగ్ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయారు.
ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జగన్ హయాంలో రోడ్లను విధ్వంసం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4,151 కి.మీ. మేరకు రహదారులపై ఉన్న గుంతలు పూడ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇస్తామని ఆర్‌అండ్‌బీకి హామీ ఇచ్చారు. ఓటాన్ అకౌంట్‌లో ఈ నిధులు కేటాయిస్తామని, రహదారుల రిపేర్లకు తక్షణమే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇకపై ఏ సమస్య ఉన్నా తనదృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి వచ్చే బూడిద(ప్లైయా్‌ష)ను రహదారి మరమ్మతులకు ఉపయోగించే అంశంపై పైలెట్ అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్‌అండ్‌బీకి సూచించారు. రోడ్లపై గుంతలు పూడ్చేందుకు బూడిదను ఉపయోగించాలని ఈ నెల 2న జరిగిన సమావేశంలో సీఎం ఆదేశించారు.బూడిద వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీ, సీఆర్‌ఆర్‌ఐ, ఢిల్లీ, ఎస్‌ఆర్‌ఎమ్ యూనివర్సిటీ అమరావతి నిపుణుల సహకారంతో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు.
ముంబైకు చంద్రబాబు
లయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ రిసెప్షన్ కోసం నేడు(శనివారం) సీఎం చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com