CM Jagan : ఏపీ సీఎం జగన్‌కు CBI కోర్టులో ఊరట...!

ఏపీ సీఎం జగన్‌కు సిబిఐ కోర్టులో ఊరట లభిచింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేసింది. అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న జగన్. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి...బెయిల్ ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖల చేసిన పిటిషన్ పై సిబిఐ కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. గతంలోనే ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ కోర్టు.... తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువరిస్తూ జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను డిస్మిస్ చేసింది. అంతకుముందు జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సిబిఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘరామ దాఖలు చేసిన పిటిషన్ ను ఈ ఉదయం తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో సిబిఐ కోర్టు తీర్పు వెలువరించింది.
అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డిలకు గతంలో షరతులో కూడిన బెయిన్ ను సిబిఐ కోర్టు మంజూరు చేసింది. దీంతో బెయిల్ పై ఉన్న జగన్ సీఎం హోదాను అడ్డుపెట్టుకుని షరతులు ఉల్లంఘిస్తున్నారని, వివిధ కారణాలతో కోర్టుకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారని ఎంపీ రఘురామ సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగన్, విజయసాయి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. బెయిర్ రద్దు చేసి జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసును వేగంగా విచారించాలని పిటిషన్ లో కోరారు. అక్రమాస్తుల కేసుపై సిబిఐ కోర్టులో గత రెండుమూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com