AP : 24 గంటల్లో అల్పపీడనం ప్రభావం.. ఏపీ కోస్తా, సీమకు భారీవర్ష సూచన

AP : 24 గంటల్లో అల్పపీడనం ప్రభావం.. ఏపీ కోస్తా, సీమకు భారీవర్ష సూచన
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ప్రస్తుతం శ్రీలంక తీరంలో నైరుతి బంగాళాఖాతంలో అది కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అది వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తిరుపతి పట్టణంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం ఉన్నా, చలి తీవ్రత కనిపిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం తొమ్మిది గంటల వరకు పాడేరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఉదయం 9 గంటలు దాటిన తరువాతే ఏజెన్సీ వాసులు బయటకు వస్తున్నారు. పొగమంచు ఎక్కువగా వుండటంతో ప్రభావానికి ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి. మంచు దెబ్బకు వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.

Tags

Next Story