AP: ఏపీ తలరాతను మార్చే సదస్సు నేటి నుంచే

సీఐఐతో కలిసి ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు శుక్ర, శనివారాలు జరగనున్నది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు దేశ, విదేశాల ప్రతినిధులు గురువారమే నగరానికి చేరుకున్నారు. నగరంలో ఎటు చూసినా భాగస్వామ్య సదస్సు కోలాహలం కనిపిస్తోంది. సదస్సుకు ముందు ఒకరోజు ముందు నోవాటెల్ వేదికలో 35 ఒప్పందాలు జరిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో మొత్తం రూ.3.65 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో రూ.2.65 లక్షల కోట్లు కేవలం ఇంధన రంగంలోనివే. వీటి ద్వారా 1.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండ ురోజుల సదస్సు జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తం ఎనిమిది హాళ్లు ఏర్పాట్లుచేశారు. హాలు-5లో ప్రధాన వేదికపై ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్నది. సదస్సుకు సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరవుతారు. అతిథులకు 700 కార్లు వినియోగిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి హోటళ్ల వరకు వారిని తీసుకురావడానికి 14 బస్సులు ఏర్పాటుచేశారు. 1,200 గదులను ముందుగానే సిద్ధం చేశారు.
ఏపీకి మరో భారీ పెట్టుబడి
ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్ సంస్థ అడుగుపెట్టనుంది. సోలార్ ఇంగాట్, వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్& గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో రెన్యూ పవర్ పూర్తిస్థాయి పెట్టుబడులు పెడుతుండటం గర్వంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో రూ.22వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు వచ్చిన ఈ కంపెనీ.. 2019లో నాటి ముఖ్యమంత్రి జగన్ నిర్వాకంతో తిరిగి వెళ్లిపోయింది. పీపీఏల రద్దుతోపాటు పునఃసమీక్ష చేపట్టిన గత ప్రభుత్వ విధానాలను ఆ సంస్థ తీవ్రంగా విభేదించింది. ఎన్డీయే కూటమి అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి తిరిగి వచ్చింది.
ఇవాళ భారీ ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, రాజకీయ వర్గాల్లో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ట్వీట్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలోకి ఓ భారీ అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులతో అడుగుపెట్టబోతున్నట్టు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. పూర్తి వివరాలను ఇవాళ ఉదయం 9 గంటలకు వెల్లడిస్తామని... ఎవరికైనా తెలిస్తే చెప్పుకోండి చూద్దాం అంటూ సస్పెన్స్‌కు తెరలేపారు. "కార్పొరేట్ బోర్డు రూముల్లో కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

