AP: ఏపీలో డీఏ పెంపు.. జీవో జారీ

AP: ఏపీలో డీఏ పెంపు.. జీవో జారీ
X
హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ఉద్యో­గు­లు, పిం­ఛ­న­ర్ల­కు దీ­పా­వ­ళి కా­ను­క­ను ఏపీ రా­ష్ట్ర ప్ర­భు­త్వం అమ­ల్లో­కి తె­చ్చిం­ది. ఉద్యో­గు­ల­కు డీఏ మం­జూ­రు చే­స్తూ ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. 2024 జన­వ­రి 1 నుం­చి డీఏ అల­వె­న్స్‌­ను 3.64 శాతం పెం­చు­తూ ఆదే­శా­లి­చ్చిం­ది. డీఏ పెం­పు 2024 జన­వ­రి 1 నుం­చి అమ­ల్లో­కి వస్తుం­ద­ని పే­ర్కొం­ది. రె­గ్యు­ల­ర్ ఉద్యో­గుల వే­త­నం­లో ఇప్ప­టి వరకు డీఏ శాతం 33.67 ఉం­డ­గా.. అది 37.31 శా­తా­ని­కి పె­ర­గ­నుం­ది. ఈ మే­ర­కు ఆర్థిక శాఖ ము­ఖ్య కా­ర్య­ద­ర్శి పీ­యూ­ష్‌­కు­మా­ర్‌ ఆదే­శా­లు జారీ చే­శా­రు. పె­రి­గిన డీ­ఏ­తో పాటు సం­బం­ధిత బకా­యి కూడా త్వ­ర­లో­నే వి­డు­దల చే­స్తా­మ­ని ఏపీ ఆర్థిక శాఖ ప్ర­క­టిం­చిం­ది. కాగా, ఏపీ­లో­ని ప్ర­భు­త్వ ఉద్యో­గు­ల­కు నా­లు­గు డీ­ఏ­లు పెం­డిం­గ్‌­లో ఉన్నా­యి. వీ­టి­లో ఒక డీ­ఏ­ను ఇవ్వ­డా­ని­కి సీఎం చం­ద్ర­బా­బు ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. అయి­తే, నా­లు­గు డీ­ఏ­ల­కు గానూ ఒక డీ­ఏ­ను మా­త్ర­మే వి­డు­దల చే­య­డం పట్ల ప్ర­భు­త్వ ఉద్యో­గు­లు అసం­తృ­ప్తి వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

ఉద్యోగుల ఖాతాల్లో డీఏ జమ చేయడానికి ప్రభుత్రానికి ప్రతి నెలా రూ.160 కోట్ల ఖర్చు అవుతున్నట్టు సీఎం తెలిపారు. పోలీసులకు ఈఎల్‌.. ఒక ఇన్‌స్టాల్‌ మెంట్‌ ఎల్‌ ఇస్తామని.. ఈ ఏఎల్ కింద రూ.105 కోట్లు ఇస్తామని తెలిపారు. మరో రూ.105 కోట్లు జనవరిలో ఇస్తామని హామీ ఇచ్చారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్‌లైన్‌ చేస్తాన్నారు. అలాగే ఉద్యోగులు చైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్‌ పెండింగ్‌లో ఉందని..ఈ దీపావళికి RTC ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తామని సీఎం తెలిపారు. కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి గౌరవప్రదమైన డిజిగ్నేషన్‌ ఇస్తామన్నారు. ఎర్న్‌ లీవ్‌ ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇస్తామని ఫైనాన్స్ కమిషన్‌ గ్రాంట్స్‌ రూ.2,793 కోట్లు ఇచ్చామని తెలిపారు. ఉద్యోగులందరూ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి. రేపటి నుంచి మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు.





Tags

Next Story