PAWAN: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

PAWAN: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్
X
అభివృద్ధిలో దూసుకుపోతున్న పిఠాపురం.. వంద పడకలకు పిఠాపురం ఆస్పత్రి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. తన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితుల్ని తగ్గించడానికి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో ఉన్న ముఫ్పై పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడక ఆస్పత్రిగా మార్చేందుకుఆయన చతేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఈ మేరకు ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సమయంలో అక్కడి 30 పడకల సీహెచ్‌సీని వందకు పెంచుతానని హామీ ఇచ్చారు. తాజాగా ఆస్పత్రిలో వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.38.32 కోట్లు విడుదల చేసింది. పెరిగిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డుల నిర్మాణానికి వీటిని ఉపయోగిస్తారు. కొత్తగా 66 మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి వస్తారు. జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్స్‌, పెథాలజీ, డెంటల్‌, రేడియాలజీ వంటి కీలక విభాగాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.


పెరగనున్న వైద్య సిబ్బంది

ఆసుపత్రి సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది దీనిలో ఉంటారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు అదనపు విభాగాలు రానున్నాయి. పిఠాపురం ఆసుపత్రికి జనరల్ సర్జన్, చెవి-ముక్కు-గొంతు నిపుణులు, కంటి వైద్యం, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, డెంటల్, రేడియాలజీ వంటి కీలక విభాగాలు రానున్నాయి. నర్సింగ్, వైద్య సిబ్బంది పెరగనున్నారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన ఆరు నెలలలోపునే అమలు కావడం సంతోషంగా ఉందంటున్నారు పిఠాపురం వాసులు. దీంతో పిఠాపురం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల, సమీపం నియోజకవర్గాల ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Tags

Next Story