AP: నాగబాబుకు మంత్రి పదవి.. స్పందించిన పవన్

సోదరుడు, జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన పార్టీకి చేసిన త్యాగానికి రాజ్యసభ సీటు ఇద్దామని అనుకున్నా కుదర్లేదని తెలిపారు. నాగబాబు తనతో పాటు సమానంగా పనిచేశారని, పార్టీ కోసం బలంగా నిలబడ్డారని చెప్పారు. జనసేన మంత్రుల ఎంపికలో కులం చూడలేదని, పనితీరును ప్రామాణికంగా తీసుకున్నట్లు వెల్లడించారు. నాగబాబు ముందు ఎమ్మెల్సీగా ఎంపికవుతారని తెలిపారు.
ఎమ్మెల్సీ అయ్యాకే మంత్రిగా నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి దక్కడంపై స్పందించిన పవన్... మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. అనంతరమే మంత్రిగా ప్రమాణం చేస్తారని వెల్లడించారు. దీంతో నాగబాబు జనవరిలో మంత్రి పదవి చేపడతారన్న వార్తలకు చెక్ పడింది. నాగబాబు మంత్రి అయ్యేది మరో మూడు నెలల తర్వాతే అన్న విషయం స్పష్టమైంది. తన సోదరుడని మంత్రిగా నాగబాబుకు అవకాశం ఇవ్వలేదని కూడా పవన్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com