AP: గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పిన పవన్‌కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం భారీగా నిధులు పెంచింది. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. గ్రామాల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వేడుకల నిర్వహణ కోసం మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25వేలకు పెంచినట్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామని పవన్ తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం రోజున పాఠశాలల్లో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి.. బహుమతులు ఇవ్వాలన్నారు. ఆగస్టు 15న పాఠశాలల్లో స్వాతంత్ర్య సమరయోధులను, రక్షణ రంగంలో పని చేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలని పవన్ సూచించారు.
ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారన్న ఆయన.. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేశామన్నారు.. ఇక, జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని వెల్లడించారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టతను ఈ సందర్భంగా చెప్పాలని సూచించారు.. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలvf ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు.
కేంద్రం శుభవార్త
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.. కాగా, గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టీ.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com