PAWAN: ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్

PAWAN: ఆసుపత్రిలో చేరిన పవన్ కల్యాణ్
X

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. ‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ సహా పలు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది’ అని ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. ఈ నెల చివర్లో గానీ, మార్చి మొదటి వారంలో గానీ మరోసారి ఆస్పత్రికి వచ్చే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరి 24 నుంచి మొదలయ్యే బడ్జెట్‌ సమావేశాల్లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొనబోతున్నట్లు జనసేన పార్టీ అధికారిక ‘ ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసింది.పవన్‌ గత కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారు.

Tags

Next Story