AP: ఏపీ రాజకీయాల్లో పవన్ ముద్ర
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తక్షణమే స్పందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. తనకు కేటాయించిన ఐదు శాఖలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన విధంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తన మార్క్ సైతం ఉండేలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. తన దృష్టికి వచ్చిన ఎటువంటి సమస్యనైనా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు తన సొంత నిధులను ఇస్తూ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు కేటాయించడంలో ముందంజలో ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి అయినా సరే ప్రభుత్వానికి ఎటువంటి భారం కలుగకుండా సొంత నిధులను మంజూరు చేస్తూ తనశైలిని కొనసాగిస్తున్నారు.
ఆ ఉద్యోగులకు తీపి కబురు
పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. ఒప్పంద ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్ తదితర సౌకర్యాలను పునరుద్ధరించనున్నారు.
ప్రముఖ నటుడి భేటీ
పవన్‌తో ప్రముఖ సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణన్ పార్థిబన్ కోలీవుడ్‌తోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించాడు. పార్థిబన్ దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. 14 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. టాలీవుడ్ సినీ రంగంతో కూడా ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1984లో డైరెక్టర్ కే భాగ్యరాజ్ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com