PAWAN: పవర్ స్టార్ ఆన్ డ్యూటీ..

వెండితెరపై పవన్ స్టార్‌గా పేరు గడించిన పవన్ కల్యాణ్.. అటు రాజకీయాల్లో.. ఇటు డిప్యూటీ సీఎంగా డైనమిక్ లీడర్ అని నిరూపించుకుంటున్నారు. తన వద్దకు వచ్చే అర్జీలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కారం అయ్యేలా ఆయా శాఖల అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే శాఖలవారీగా సమీక్షలు చేసి గత ప్రభుత్వ అవినీతిని వెలుగులోకి తెచ్చిన పవన్.. ఇప్పుడు పల్లెపండుగల పేరుతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తున్నారు.
చంద్రబాబు ప్రశంసల వర్షం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన ‘పల్లె పండుగ’ విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. ఏపీలోని 13,326 గ్రామాల్లో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పల్లెలోని ప్రజల కళ్లల్లో సంతోషం చూడటానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను తాను అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. పవన్ కల్యాణ్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడంతో అందరూ ఆయన్న అభినందిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13,326 గ్రామాల్లో మొత్తం 30 వేల పనులను రూ. 4,500 కోట్లతో చేపట్టాలా పవన్ కల్యాణ్ చర్యలు తీసుకున్నారని, ఆయన కష్టపడుతున్న తీరు చూస్తుంటే తనకే ముచ్చటేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జనసేన అధినేతకు కితాబు ఇచ్చారు. ఐదు సంవత్సవరాల వైసీపీ పాలనలో పల్లెల్లోని ప్రజలు ఉపాధి హామీ పనులులేక ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే
కేంద్ర సాయంతో..
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో రూ. 4,500 కోట్లతో పలు పనులు జరుగుతాయని, గ్రామంలోని ప్రజలకు ఉపాధి హామీ పనులు ఇస్తామని ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. 13 వేలకు పైగా గ్రామాల్లో పల్లె పండుగను విజయవంతం చెయ్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు పవన్ ఇప్పటికే మనవి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com