AP: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు నిజమే

AP: ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు నిజమే
X
ఏపీ శాసనసభలో పవన్ సంచలన ప్రకటన... 275 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని వెల్లడి

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభలో వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి జరిగిందని వెల్లడించారు. నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని... 275 మంది అధికారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ చెప్పారు.

అక్కడ భవనం మాత్రమే ఉంది: అచ్చెన్నాయుడు

వైసీపీ ఉద్ధానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించిన తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా మండిపడ్డారు. ‘ 2019లోకిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి టీడీపీ ఫౌండేషన్ వేసింది. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల్లో ఓడిపోయాం. గత ప్రభుత్వం భవనం మాత్రమే కట్టింది. అక్కడ మెషినరీ లేదు, సిబ్బంది లేరు. ఒక పాత డయాలసిస్ మెషీన్ పెట్టి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టినట్లు జగన్ గొప్పగా చెప్పుకున్నారు’ అని మండిపడ్డారు.

మండలిలో మాటల యుద్ధం

ఏపీ శాసన మండలిలో అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం వసతి దీవెనను సక్రమంగా అమలు చేయలేదని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సరైన సమాధానం చెప్పకుండా అధికార పక్షం తప్పించుకుంటోందని ఆరోపించింది.

Tags

Next Story