PAWAN: దేశానికి పవన్ కల్యాణ్ క్షమాపణలు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన దుర్ఘటనకు మనస్ఫూర్తిగా యావత్ జాతికి పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. దీనిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారని వెల్లడించారు. ఇలాంటివి జరకుండా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పవన్ వచ్చిన టైంలోనే జగన్ రావడంతో కాసేపు హైడ్రామా నడిచింది. ఈ దుర్ఘటనకు టీటీడీ బాధ్యత తీసుకోవాలన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్ర జరిగిందా అనే అనుమానం ఉందంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారులు, పోలీసులు భక్తులను గంటలకు గంటలు పడిగాపులు కాచేలా చేశారు. ఇంత మంది పోలీసులు ఉండి.. ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. కొందరు అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. టీటీడీ వీఐపీలకు కాదు.. సామాన్యులకు సేవ చేయాలి' అని పవన్ అన్నారు.
బాధితులను పరామర్శించిన పవన్
తిరుపతి తొక్కిసలాట బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అంతకుముందు తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, మరికాసేపట్లో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కూడా తిరుపతికి చేరుకోనున్నారు.
భక్తులను ఒకేసారి ఎందుకు వదిలారు? : పవన్
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులను ఎందుకు ఒకేసారి క్యూ లైన్లలోకి వదలాల్సి వచ్చిందని ప్రశ్నించారు. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున పద్మావతి పార్క్‌కు వచ్చారని అధికారులు వివరించారు. కాగా, అంతకుముందు సీఎం చంద్రబాబు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com