PAWAN: పవన్ అంటే లోకల్ అనుకుంటివా.. నేషనల్

మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరుపున 5 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. దీంతో నార్త్‌లోనూ పవన్ హవా నడుస్తోందని.. పవన్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ అని ఆయన అభిమానులు, కూటమి పార్టీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం వేళ బీజేపీ ఏ ఒక్క అవకాశం వదులుకోలేదు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించింది. వన్ ప్రచారం చేసిన పూణే, బల్లార్ పూర్, షోలాపూర్ లో బీజేపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. డెత్లూర్, లాతూర్ లలో మాత్రం ఇప్పటి వరకు ఫలితాల సరళి హోరాహోరీగానే కనిపిస్తోంది. అయితే, బీజేపీకి మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మద్దతు కనిపించింది. ఎన్నికల సమయంలో మహాయుతి ఇచ్చిన హామీలు ప్రజల్లోకి వెళ్లాయి. మోదీతో సహా బీజేపీ ముఖ్య నేతలు ఎంవీఏ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ప్రచారం చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూటమి విజయం సాధించగా.. ప్రత్యేకించి పవన్ పోటీ చేసిన ప్రాంతాల పైన చర్చ నడుస్తోంది.
బీజేపీ నేతల ఆరా
పవన్ కల్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా మహారాష్ట్ర గడ్డ ఛత్రపతి శివాజీ నేలగా అభివర్ణించారు. మరాఠా ప్రజల భవిష్యత్ కావాలంటే బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. తనకు బాలా సాహెబ్ థాక్రే పైన ఉన్న అభిమానం చాటుకున్నారు. శివసేన, జనసేన మధ్య సారూప్యత వివరించారు. ఎంఐఎం పైన విమర్శలు చేసారు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు. ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాల సరళిని జనసైనికులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అటు బీజేపీ నాయకత్వం సైతం పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో వస్తున్న ఫలితాల పై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, పూర్తి ఫలితాలు వచ్చిన తరువాత పవన్ ప్రభావం ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com