AP DSC: నేటి నుంచే ఏపీ డీఎస్సీ మెరిట్ లిస్టులు

మెగా డీఎస్సీ ఫలితాలపై ప్రకటనలపై నెలకొన్న అనుమానాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పటాపంచలు చేసింది. అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీ రాసిన అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు శుభవార్త చెప్పారు. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో నేటి నుంచి మెరిట్ లిస్ట్‌లు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్సైట్
ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
కాల్ లెటర్ అందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని కన్వీనర్ ఓ ప్రకటనలో సూచించారు.వెరిఫికేషన్‌కు హాజరు కావడానికి ముందే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరన్నారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్‌ను డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు డీఎస్సీ వెబ్సైట్, క్యాండిడేట్ లాగిన్లలో, ప్రభుత్వం విడుదల చేసే ప్రతికా ప్రకటనల ద్వారానే తాము తెలియజేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com