పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం
రాష్ట్ర ఎన్నికల సంఘం మొండివైఖరితో ముందుకెళ్తోందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గతంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సీఎస్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు బదులిచ్చారు SEC నిమ్మగడ్డ. ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుందని.. మరిన్ని అంశాలను కూడా కమిషన్ నిశితంగా గమనిస్తోందని బదులిచ్చారు. హై కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అధికార పార్టీలోని ఓ సీనియర్ ప్రతినిధి తిరుపతి ఉపఎన్నికల అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని.. ఏప్రిల్, మే మాసాల్లో జరగవచ్చని వ్యాఖ్యలు చేశారని లేఖలో గుర్తుచేశారు SEC. ఈ తరహా వ్యాఖ్యలు కమిషన్ నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆక్షేపించారు. ప్రస్తుత కమిషనర్ పదవి విరమణ అనంతరం ఎన్నికలు జరుగుతాయని కూడా ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ఈ తరహా సమాధానమే పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి కూడా వ్యక్తం కావడం శోచనీయమని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ప్రజా ప్రయోజనాల ప్రకారమే వ్యవహరిస్తుందని లేఖలో స్పష్టం చేశారు సీఎస్. సీఎస్ సహా ఇతర అధికారులతో సమావేశానికంటే ముందు రోజు ఈ లేఖ రాశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్.

SEC నిమ్మగడ్డ లేఖకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ జవాబిచ్చారు. ఎస్‌ఈసీతో భేటీ కంటే ముందే ఈ లేఖను ఎన్నికల సంఘానికి పంపించారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికల నిర్వహణ సాధ్యమని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం టీకా అందించే ఏర్పాట్లలో అధికారులు తలమునకలై ఉన్నారన్నారు. ఈ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తుందన్న ఆరోపణలను సీఎస్ ఖండించారు. కొవిడ్‌ వల్ల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కావట్లేదని ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. అధికారిక సంప్రదింపుల్లో రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నవారిని ప్రస్తావించడం సరికాదని లేఖలో వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ప్రజల ప్రాణాలనుపణంగా పెడుతూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నారని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విమర్శించారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘనే అని అన్నారు. కొవిడ్ టీకా ప్రక్రియలో ఉన్నామని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం మొండివైఖరితో ముందుకెళ్తోందని విమర్శించారు. గతేడాది మార్చి 15న ఒకే కరోనా కేసున్నా స్థానిక ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారని ద్వివేది ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ విషయంలోనూ అలాగే ఏకపక్షంగా ప్రవర్తిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story