జగన్ పై పోరు.. దశలవారీగా ఉద్యమం

జగన్ పై పోరు.. దశలవారీగా ఉద్యమం
X
ఉద్యోగుల తరుపున బాలకృష్ణ అసెంబ్లీలో గళం వినిపించాలని ఏపీజేఏసీ నేతలు కోరారు.

జగన్ సర్కారుపై పోరులో ఏపీ ఉద్యోగులు ఎక్కడా తగ్గడం లేదు. దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న ఏపీ ఉద్యోగులు.. ఇపుడు ఎమ్మెల్యేలకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ క్యాంప్ కార్యాలయానికి ఏపీజేఏసీ నేతలు వెళ్లారు. అయితే బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నాయకులకు వినతిపత్రం అందజేసారు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని ఏపీజేఏసీ నేతలు ఆరోపించారు. మూడు దశలుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. ఉద్యోగుల తరుపున బాలకృష్ణ అసెంబ్లీలో గళం వినిపించాలని ఏపీజేఏసీ నేతలు కోరారు.

Tags

Next Story