Ap Employees : పీఆర్సీ జీవోపై ఏపీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి..!

Ap Employees : పీఆర్సీ జీవోపై ఏపీ ఉద్యోగ సంఘాలు, అమరావతి జేఏసీ రగిలిపోతున్నాయి. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏలను భారీగా తగ్గించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉద్యోగ సంఘాల నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు.. ఒకటి రెండు రోజుల్లో సమావేశమై ఐక్య కార్యాచరణ ప్రకటించాలని అనుకుంటున్నాయి. దీనిలో భాగంగానే మరో ప్రయత్నంగా.. సీఎంవో అధికారులతో సమావేశమయ్యారు ఉద్యోగ సంఘ నేతలు. పీఆర్సీ జీవోను వెంటనే వెక్కి తీసుకోవాలని.. హెచ్‌ఆర్‌ఏపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా సమ్మెకు దిగడానికైనా వెనకాడకూడదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com