ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
తొలిదశలో సర్పంచ్‌ పదవికి 7 వేల 460 నామినేషన్లు వేశారు.

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఒక్కరోజు గ్యాప్ తర్వాత ఎల్లుండి ఓటింగ్‌ జరుగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలు పంపుతోంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

ఏకగ్రీవాల విషయంలో ఈసీ ఆదేశాల ప్రకారం.. చిత్తూరు, గుంటూరు సహా అన్ని చోట్లా అధికారులు నిర్ణయాలు తీసుకుని ఫలితాలు ప్రకటించారు. తొలిదశలో సర్పంచ్‌ పదవికి 7 వేల 460 నామినేషన్లు వేశారు. 9వ తేదీ ఉదయం 6.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని SEC నిమ్మగడ్డ కోరారు. ఎక్కడా ప్రలోభాలకు తావు లేకుండా చూసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశామన్నారు. 9న పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


Tags

Next Story