AP: ఊరూరా ఘనంగా రైతన్న మీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 'రైతన్న మీకోసం' కార్యక్రమం ఘనంగా ఆరంభమైంది. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 7 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సోమవారం ఆరంభమై ఈ నెల 29 వరకు వ్యవసాయ అధికారులు ప్రతి రైతు ఇంటికి స్వయంగా వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వ్యవసాయ అధికారులు రైతులను సాంప్రదాయంగా వస్తున్న పంటల సాగును కాకుండా, నూతన, లాభదాయకమైన పంటల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించి, సిద్ధం చేస్తున్నారు. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. దీంతో పాటుగా, పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం వంటి వాటిపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
పంచ సూత్రాల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఘంటసాల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా ముగ్గురు రైతులతో మాట్లాడారు. సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర, యాంత్రీకరణ, పుడ్ ప్రాసేసింగ్ యూనిట్లు, ప్రభుత్వం నుంచి మద్దతు ధర కల్పిస్తునట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తునట్టు తెలిపారు.ఇటీవల మొందా తుఫాను కారణంగా నష్టపోయిన పంట వివరాలు నమోదు చేసినట్టు తెలిపారు. నీటి సంఘాలను నియమించిన రైతులకు మేలు చేశాం అన్నారు. రైతులకు అవసరమైన సబ్సిడీ పరికరాలు అందిస్తునట్టు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 14 వేలు జమ చేసినట్టు తెలిపారు.
సిబ్బంది, పంచ సూత్రాల అమలు
ఈ కార్యక్రమంలో భాగంగా, రైతు సేవ కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు ఆరుగురు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే, 'పంచ సూత్రాల' అమలుపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసింది. ఈ అధికారులు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా తగిన సూచనలు చేయనున్నారు. ప్రతి మూడు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభజించి.. ఒక్కొక్క బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 గృహాలు) సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 24 నుంచి 29 వరకు అధికారుల బృందాలు రైతుల ఇళ్లకు వెళ్లి సీఎం సందేశ లేఖ, కరపత్రం అందజేస్తారు. ఏపీఏఐఎంఎస్ యాప్ వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో రైతుల నుంచి సూచనలు, ఫిర్యాదులు అధికారులు స్వీకరిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

