AP: నేటి నుంచే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు నేటి నుంచి ఉచిత బస్సు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు వర్తించనుంది. ప్రయాణానికి ముందు సరైన గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు పథకం వర్తించదు. బసుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా స్సుఅవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బస్సుల్లో రద్దీ పెరగడం వల్ల అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంటోంది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
ఏపీ ప్రభుత్వం మహిళల ప్రయాణ ఖర్చు తగ్గించడానికి ఎన్నికల హామీని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపగా.. తాజాగా అందుకుగానూ మార్గదర్శకాలు సైతం జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గించడమే కాక, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆర్టీసీ విధానాలను పరిశీలించిన తరువాతే కూటమి సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది. స్త్రీ శక్తి పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని మంత్రి నాదెండ్ల చెప్పారు.అటు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ స్కీమ్ అమలౌతుంది. ఏపీలో నివాసం ఉంటున్నట్టు ధృవీకరణ ఉంటేచాలు, బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం చెయ్యొచ్చు. అర్హులైన ప్రయాణికులకు జీరో ఫేర్ టికెట్లు ఇస్తారు. ఆ ఖర్చు మొత్తాన్ని RTCకి ప్రభుత్వమే పరిహారంగా చెల్లిస్తుంది. మహిళా కండక్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటౌతాయి. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, జీరో టికెటింగ్‌పై కండక్టర్లకు శిక్షణ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com