AP: విధ్వంసం నుంచి వికాసం వైపు

ఆర్థిక సవాళ్లు, పెండింగ్ ప్రాజెక్టులు, మౌలిక వసతుల లోటుతో కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా కొత్త అడుగులు వేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల విస్తరణ వంటి చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పయనిస్తున్నదని ప్రకటిస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ద్విచక్ర విధానాన్ని అవలంబిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, మరోవైపు సంపద సృష్టి, పరిశ్రమల ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. అమరావతి రాజధాని అభివృద్ధి, రహదారులు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ఈ దిశగా తీసుకున్న కీలక నిర్ణయాలుగా భావిస్తున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు
విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు
పరిశ్రమలకు రూ.3,161 కోట్లు
సర్దుబాటు నిధి.. రూ.1,500 కోట్లు
వీబీ జీ రామ్ జీకి.. రూ.8365 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు
ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు
జల్ జీవన్‌కు రూ.4,000 కోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1,037 కోట్లు
విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.. ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు
9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం
రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు రూ.30,000 కోట్లు
ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్
పాఠశాల విద్యాశాఖ- రూ.32,308 కోట్లు
పంచాయతీరాజ్- రూ.22,942 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.13,598 కోట్లు
అన్నదాత సుఖీభవ- రూ.6,660 కోట్లు
పోలవరం- రూ.6,105 కోట్లు
హోంశాఖ- రూ.9,165 కోట్లు
మున్సిపల్ శాఖ-రూ.14,539 కోట్లు
జలవనరుల శాఖ రూ.18,224 కోట్లు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
