AP: కళారత్న, ఉగాది పురస్కారాల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న, ఉగాది అవార్డులను ప్రకటించింది. 86 మందికి కళారత్న అవార్డులు.. 116 మందికి ఉగాది అవార్డులను ఇస్తూ కూటమి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. 14 రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు కళారత్న అవార్డులు, ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ఉగాది వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ఇవ్వడం 1999 నుంచి ఆనవాయితీగా వస్తోంది. సాహిత్యం, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పకళ, జానపద, గిరిజన కళల్లో చేసిన సేవలకు ప్రభుత్వం, రాష్ట్ర సాంస్కృతిక మండలి సంయుక్తంగా ఈ అవార్డులను అందిస్తున్నాయి. రూ.50 వేల నగదుతో పాటు శాలువా, బంగారు పూత పురస్కారం అందిస్తారు. అయితే ఏడాది కూడా 2025 కళారత్న పురస్కారాలను ప్రభుత్వం అందించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com