AP: "తల్లికి వందనం" అమలుకు ముహూర్తం ఖరారు

AP: తల్లికి వందనం అమలుకు ముహూర్తం ఖరారు
X
హామీల అమలు దిశగా కూటమి సర్కార్ చర్యలు... సూపర్ సిక్స్‌ అమలే లక్ష్యంగా అడుగులు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’ గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కార్ ‘తల్లికి వందనం’ గా మార్చింది. ఈ పథకం పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టో లో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి లేదా ఏప్రిల్‌లో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

హామీల అమలు దిశగా..

ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఇప్పటికే డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. సామాజిక పింఛన్లు కూడా వెయ్యి రూపాయలు పెంచి అందిస్తోంది. ఇప్పుడు మరో పథకాన్ని ప్రజలకు అందించేందుకు రెడీ అవుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు ఒడ్డుకు చేరుతున్నందున సూపర్ సిక్స్ అమలుపై ఫోకస్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సూపర్‌ సిక్స్ అమలులో తల్లికి వందనం పథకంతోనే ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరిలో ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారు. ఇంటిలో ఎంత మంది వెళ్తే అంతమందికి ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. దీని కోసం 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూల్స్, కాలేజీల్లో దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ ఇస్తారా లేకుంటే అందులో ఇంకా కోతవిధిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న వారందరికీ అమలు చేస్తే మాత్రం 12వేల కోట్లు కావాల్సి ఉంటుంది.

విమర్శలకు చెక్

కూటమి ప్రభత్వం వచ్చినప్పటి నుంచి సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్ని నెలలు అవుతున్నా ఇంత వరకు తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వస్తోంది. టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు తల్లికి వందనం ప్రారంభించేందుకు సిద్ధమైంది.

Tags

Next Story