AP: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు అప్పటినుంచే..

AP: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు అప్పటినుంచే..
X
కసరత్తు ప్రారంభించిన అధికారులు... అర్హులందరికీ కార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరికి నూతన సంవత్సర కానుకగా మరో హామీ అమలుకు సిద్ధమైంది. ఏపీలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాల అధికారులు పనులు మొదలు పెట్టారు. 1.5 లక్షలకుపైగా పేద కుటుంబాలకు జనవరిలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ ప్రణాళికలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయనుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైన్‌ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ కొత్త డిజైన్‌తో అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది.

ఆ కార్టులకు మాత్రమే..

ఏపీలో ప్రస్తుతం 1.48కోట్ల రేషన్‌ కార్డులు ఉండగా...అందులో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం గుర్తించింది. ప్రస్తుతం వాటికి మాత్రమే ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరుకులపై రాయితీ లభిస్తోంది. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు తదితర సరుకులపై ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలో 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులు, 1,36,420 పీహెచ్‌హెచ్‌ కార్డుదారులు గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు అని అధికారులు గుర్తించారు.

కార్డులు ఎలా ఉంటాయంటే..

కొత్త కార్డులకు సంబంధించి డిజైన్లపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. ఆ కార్డులపై లేత పసుపు రంగు, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన డిజైన్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48కోట్ల రేషన్‌కార్డులు ఉంటే.. వీటిలో 90 లక్షల కార్డుల్ని ఎన్ఎఫ్ఎస్ఏ కింద కేంద్రం గుర్తించింది. ఈ కార్డులకు ఉచిత బియ్యం, కందిపప్పు, పంచదార వంటి సరుకులపై రాయితీ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార, జొన్నలు, రాగులు వంటి సరుకులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన ఆర్థిక భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైన్‌ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ కొత్త డిజైన్‌తో అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Tags

Next Story