AP: నిరుద్యోగులకు ఏపీ సర్కార్‌ భారీ శుభవార్త

AP: నిరుద్యోగులకు ఏపీ సర్కార్‌ భారీ శుభవార్త
X
కేజీబీవీ స్కూళ్లలో టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... 604 పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల భర్తీకి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 604 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024-25 సంవత్సరానికి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కాగా, అక్టోబర్‌ 10 తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.

దసరా సెలవులు అప్పటినుంచే...

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్‌ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచే ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

లోకేశ్ కీలక ఆదేశాలు

తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాలని నారా లోకేశ్ ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచిలు ఏర్పాటు చేయాలి, మంచినీరు, టాయ్ లెట్స్ వంటివి పూర్తిస్థాయిలో కల్పించాలని.. కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టిసారించాలని సూచించారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అస్సెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పనితీరు బాగుందని తెలిపారు.


Tags

Next Story