AP: విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్‌

AP: విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్‌
X
తొలి దశ డీపీఆర్‌లకు ప్రభుత్వం ఆమోదం... హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలిదశ డీపీఆర్ కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తంగా మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. వైజాగ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలోమీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గాను కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్ లోనూ పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మొత్తం 76.9కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. పచ్చ జెండా ఊపింది.

విజయవాడ మెట్రో రైలుకు కూడా...

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 66.15 కిలోమీటర్ల దూరంతో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది.. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. ఇక, మొదటి ఫేజ్ లో 1,152 కోట్ల రూపాయలతో భూసేకరణ చేయనుండగా.. రూ.11,009 కోట్లతో మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు.. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్‌.. పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచ పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతికి ఇలా మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.


1ఎ కారిడార్‌లో భాగంగా గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్‌స్టాండ్‌ వరకు; 1బిలో భాగంగా పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్‌; పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్‌ను రెండు దశల్లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌ను ఆమోదిస్తూ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు.

విశాఖలో 9 ఎకనామిక్స్ స్పెషల్ జోన్లు ఏర్పాటు

ఏపీలో జిల్లాల వారీగా 9 స్పెషల్ ఎకనామిక్స్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీటిలో విశాఖ ఉమ్మడి జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ, ఈ బోనంగి, మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి, అచ్చుతాపురం, రాంబిల్లి, జి కోడూరు ప్రాంతాలు దీని పరిధిలో ఉన్నాయి.

Tags

Next Story