దిత్వా ఎఫెక్ట్.. రైతులకు కూటమి భరోసా

ఏపీలో దిత్వా ఎఫెక్ట్ బాగానే పడింది. ఈ తుఫాన్ వల్ల రైతులే ఎక్కువగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు చాలా వరకు ధ్వంసం అయిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయి ఎక్కడెక్కడ ఈ తుఫాన్ వల్ల నష్టాలు వచ్చాయో అక్కడ పటిష్టమైన సర్వేలు నిర్వహించి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు చర్యలు మొదలు పెట్టింది. ఓటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటి ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ఎప్పటికప్పుడు సహాయం అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు రైతుల నుంచి పెద్దగా డిమాండ్లు రాకపోయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచిస్తుంది కాబట్టి వెంటనే నష్టపోయిన వారి లిస్టును తెప్పించుకుంది.
ఎక్కువగా నెల్లూరు జిల్లాలో రైతులు నష్టాలు పాలైనట్టు ప్రభుత్వం గుర్తించింది. అందుకే వారికి 80 శాతం సబ్సిడీ మీద పంట విత్తనాలు అందించడానికి సిద్ధమైంది. అందులో వరి, మొక్కజొన్న, ఇతర పంటల విత్తనాలు కూడా ఉన్నాయి. రైతులు ఎన్ని ఎకరాల్లో ఈ పంటలు సాగు చేస్తున్నారు వాళ్ళందరికీ అందే విధంగా విత్తనాలను కొనుగోలు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. ఏ ఒక్కరికీ తక్కువ రాకూడదని.. అందరికీ సమన్యాయం జరగాలన్నారు. దాదాపు 1,50,000 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని దిత్వా వల్ల నష్టపోయిన జిల్లాలో అందించబోతున్నారు.
గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎన్ని వచ్చినా సరే రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో జగన్ రైతులను పరామర్శించాలి అనుకుంటే పొలాల్లో స్టేజీలు వేయించుకొని దూరం నుంచే రైతులను పరామర్శించి వచ్చిన చరిత్ర జగన్ కే దక్కింది. కానీ ఇప్పుడు కూటమి మాత్రం రైతులను గుండెల్లో పెట్టుకుంటుంది. ఎలాంటి విపత్తులు వచ్చినా సరే ముందుగా రైతులకు న్యాయం జరిగే విధంగా పంట నష్టపరిహారాలను అందిస్తూ, దాంతోపాటు విత్తనాలను కూడా సబ్సిడీ మీదనే అందిస్తోంది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది చంద్రబాబు నాయుడు సిద్ధాంతం. ఆయన టెక్నాలజీని ఎంతగా ప్రోత్సహిస్తారో రైతులను అంతకంటే ఎక్కువగా ప్రోత్సహిస్తారు అనేది దీంతో మరోసారి నిరూపితమైంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

