AP Government : ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం...

X
By - Manikanta |12 Aug 2025 7:30 PM IST
ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రసూతి సెలవులతో పాటు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆశా వర్కర్లకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆశ వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజా ఉత్తర్వుల ప్రకారం ఆశా వర్కర్లకు మొదటి ,రెండు ప్రసవాల కోసం 180 రోజులు అంటే 6 నెలలు పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయస్సు 62 సంవత్సరాలుగా నిర్ణయించారు. అంతే కాకుండా సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం 50% అంటే ₹5,000 చెల్లిస్తారు. గరిష్టంగా మొత్తం ₹1,50,000 వరకు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com