AP Government : 15 శాఖల్లో బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

AP Government : 15 శాఖల్లో బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
X

15 శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024 జులై 31 నాటికి ఒకచోట ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి బదిలీలు ఉంటాయి. రెవెన్యూ, పంచాయతీ రాజ్, పురపాలక, సచివాలయాలు, గనులు, పౌర సరఫరాలు, ఇంజినీరింగ్, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది. ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బందికి బదిలీలు ఉండవు. ఐదేళ్లు ఒకే చోట ఉద్యోగం చేస్తున్న వారిని తప్పని సరిగా బదిలీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఎక్సైజ్, ఇతర శాఖల్లో మరికొద్ది రోజుల తర్వాత బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసింది.

Tags

Next Story