తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను ఒకే కార్పొరేషన్‌గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను ఒకే కార్పొరేషన్‌గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఈ రెండింటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చుతూ.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు.

తాడేపల్లి, మంగళగిరి మున్సిపాల్టీలను ఒకే కార్పొరేషన్‌గా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటినీ కలిపి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చుతూ.. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు ఇచ్చారు. మంగళిగిరి మున్సిపాల్టీతో పాటు దాని పరిధిలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను.. తాడేపల్లి మున్సిపాల్టీతో పాటు దాని పరిధిలో ఉన్న 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. ఏపీ మున్సిపల్‌ యాక్ట్‌ 1994 ప్రకారం ఈ ప్రాంతాలను.. కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

Tags

Next Story