AP : సీఐజీ మాజీ చీఫ్ పై విచారణకు ఏపీ సర్కార్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అథారిటీని నియమించింది. ఇందులో ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలిపింది. మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్‌పై ఏసీబీ డీజీకి మరో లేఖ రాశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సునీల్ కుమార్‌పై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను సభ్యులుగా నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com