ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలింపు..!

X
By - TV5 Digital Team |28 Jun 2021 3:00 PM IST
AP Curfew : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో నిబంధనలు సడలించాలని నిర్ణయించింది.
AP Curfew : ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు సడలించింది ప్రభుత్వం. కొవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో నిబంధనలు సడలిస్తూ నిర్ణయించింది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి 10 వరకు దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేసి.. ఇళ్లకు వెళ్లేందుకు గంట పాటు సమయం ఇవ్వనున్నారు. జూలై 1 నుంచి 7 వరకు తాజా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com